ఏకగ్రీవాలపై షాడో బృందాలు దృష్టిపెడతాయి: ఎస్‌ఈసీ

అసాధారణంగా ఏకగ్రీవాలు మంచిది కాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కడప జిల్లా అధికారులతో చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏకగ్రీవాలపై షాడో బృందాలు కచ్చితంగా దృష్టిపెడతాయని ఎస్​ఈసీ స్పష్టం చేశారు.

రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నాం. అందరికీ సమాన న్యాయం కల్పించాలనేదే లక్ష్యం. ఏకగ్రీవాలన్నీ తప్పుకాదు… అసాధారణంగా జరిగితేనే పరిశీలిస్తాం. పనిచేసే వారిపైనే ఎప్పుడూ విమర్శలు వస్తాయి. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు అంతా కృషి చేయాలి.

– నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఎస్​ఈసీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This