ద్రవ్యవినిమయ బిల్లు ఆగడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి: యనమల

మండలిలో మంత్రులు రెచ్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడారని యనమల విమర్శించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మంత్రులు తిట్లు అందుకున్నారని అన్నారు. ఆ మాటలు భరించలేక ప్రతిస్పందించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. నిబంధనల పరిధి దాటి ఎప్పుడూ తాము సభలో వ్యవహరించలేదని పేర్కొన్నారు.

“ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ప్రాధాన్యంగా భావించలేదు. మండలికి అంతరాయం కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం వ్యవహరించింది. విధ్వంసం అని తాము అనని మాటను అన్నట్లుగా మంత్రి సుభాష్‌చంద్రబోస్‌ చెప్పారు. బిల్లులు సెలెక్ట్ కమిటీలో ఉన్నాయని ప్రభుత్వమే కోర్టులో ఒప్పుకుంది. సెలెక్ట్ కమిటీ పరిధిలో బిల్లులు ఉండగా మళ్లీ సభలో పెట్టడం తగదు. సభలో జరిగిన పరిణామాలన్నింటికీ ప్రభుత్వమే కారణం. సబ్జెక్ట్‌తో సంబంధం లేని మంత్రులు సభలోకి ఎందుకొచ్చారు. మనీ బిల్ కాబట్టి 14 రోజుల తర్వాత ఆటోమాటిక్‌గా పాస్ అవుతుంది. లోకేశ్‌ను కొట్టాలనే ప్రయత్నం చేస్తే అడ్డుకోకుండా ఎలా ఉంటారు. సాధారణంగా ప్రతిపక్షం గొడవ చేస్తుంది… ఇక్కడ అధికారపక్షం చేస్తోంది.” యనమల రామకృష్ణుడు, మండలిలో ప్రతిపక్ష నేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This