ఈ 10 చిట్కాలతో ఎలాంటి స్ట్రెచ్ మార్క్స్ అయినా ఇట్టే పోతాయి..

స్ట్రెచ్ మార్క్స్.. మహిళలను ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది ఒకటి. అనేక కారణాలతో వచ్చే ఈ సమస్యని కొన్ని ఇంటి చిట్కాల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అవేంటో చూద్దాం.

ప్రసవం తర్వాత మహిళలకు స్ట్రెచ్ మార్క్స్ వస్తుంటాయి. అదే విధంగా బరువు పెరగడం, తగ్గడం కారణంగా కూడా ఈ మచ్చలు వస్తుంటాయి. కడుపు, భుజాలు, కాళ్లు ఇలా శరీర భాగాలపై వస్తుంటాయి. త్వరగా బరువు తగ్గడం, లేదా అంతే త్వరగా బరువు పెరగడం, ఒత్తిడి వంటి సమస్యల వల్ల ఇవి శరీర భాగాలపై ఏర్పడుతుంటాయి. వీటిని తగ్గించుకునేందుకు మార్కెట్లో దొరికే క్రీమ్స్, ఇతర ప్రత్యామ్నాయాలను ఆశ్రయించే బదులు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

చక్కెరని అందం కోసం బాగా ఉపయోగించొచ్చు. ఇందులోని ఎన్నో అద్భుత గుణాలు శరీరంపై ఏర్పడిన మచ్చలని సులువుగా పోగోడుతుంది. చక్కెరని ఆల్మండ్ ఆయిల్‌తో కలపాలి.. ఇందులో రెండు చుక్కల నిమ్మరసం వేయాలి. నూనెలో చక్కెర పూర్తిగా కరిగిపోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్ట్రెచ్‌ మార్క్స్ ఉన్న చోట రాయాలి. నెమ్మదిగా మర్దనా చేయాలి. రాసిన మిశ్రమం దాదాపు ఆరిపోయాక కడగడం, స్నానం చేయడం చేయాలి. ఇలా రెగ్యులర్‌గా నెల రోజుల పాటు చేస్తే సమస్య చాలా వరకూ తగ్గుతుంది. అయితే.. ఈ మిశ్రమంతో ఎక్కువగా రుద్దొద్దు.. సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం ఎలాంటి మచ్చలు అయినా తగ్గిపోతుంది.

కొబ్బరి నూనె ..

కొబ్బరినూనెలో చర్మానికి మేలు చేసే ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. బూటీ కేర్‌లో కొబ్బరి నూనె లేకుండా ఏది కంప్లీట్ కాదు.. చర్మానికి మాయిశ్చరైజర్‌ని అందించడంలో కొకొనట్ ాయిల్ ముందు ఉంటుంది. దీన్ని చారలపై నేరుగా రాయాలి. తర్వాత మసాజ్ చేయాలి. ఇలా చేస్తుండడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది.

కలబందతో..

అలోవేరాని ఉపయోగించి చర్మాన్ని అందంగా మార్చొచ్చు. ఎన్నో రకాల చర్మ సమస్యలకు అలోవేరా చక్కని పరిష్కారం. దీన్ని ఉపయోగించి స్ట్రెచ్ మార్క్స్‌ని సులభంగా పోగొట్టుకోవచ్చు. దీని కోసం సహజంగా దొరికే అలోవేరా గుజ్జు, మార్కెట్‌లో దొరికే అలోవెరా జెల్‌ని తీసుకుని చారల మీద పూయాలి.. ఇలానే నెమ్మదిగా మసాజ్ చేస్తూండాలి. రాసిన 15 నిమిషాలకు గోరువెచ్చని నీటితో కడిగేయాలి. కలబందలో చర్మానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ, విటమిన్ ఎ క్యాప్సూల్స్‌ వేసి బాగా కలపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని చారలపై పూసి ఆరిన తర్వాత నీటితో కడగటం, స్నానం చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే త్వరలోనే పరిష్కారం ఉంటుంది.

బంగాళదుంప రసం…

బంగాళ దుంప రసంలోనూ చర్మానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉంటాయి. దీనిని చర్మంపై వాడడం వల్ల ఏ విధమైన మచ్చలైనా ఇట్టే పోతాయి. ఇప్పుడు ఈ రసం ద్వారా సమస్యని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.. బంగాళదుంపని గుండ్రని ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు ఒక్కో ముక్కని తీసుకుని చారలపై రుద్దండి. ఆరిన తర్వాత నీటితో కడిగేయండి. నిజానికీ బంగాళ దుంపలలో విటమిన్ సి, పొటాషియం, రైబోఫ్లేవిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ప్రత్యేక గుణాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఖనిజాలు అన్ని కూడా చర్మ కణాలను వేగంగా ఉత్తేజ పరుస్తాయి. కాబట్టి ఇవ చర్మానికి చాలా మంచిది.

నిమ్మరసం..

నిమ్మరసం కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. స్ట్రెచ్ మార్క్స్‌ని తగ్గించడంలో నిమ్మరసం బాగా పని చేస్తుంది. నిమ్మరసాన్ని తీసుకుని అందులో విటమిన్ ఇ ఆయిల్ వేసి కలిపి ఆ మిశ్రమాన్ని స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేసి ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల త్వరలోనే ఫలితం కనిపిస్తుంది.

కీరా..

కీరా రసంలోనూ ఎన్నో ప్రత్యేక గుణాలు ఉంటాయి. దీనిని చర్మంపై ఉపయోగించడం వల్ల సమస్య త్వరగా తగ్గిపోతుంది. కీరా రసంలో కాసింత నిమ్మరసం కలిపి చారలపై రాయాలి.. ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల సమస్య త్వరగా తగ్గిపోతుంది.

గుడ్డు లోని తెల్ల సొన..

గుడ్డులోని తెల్ల సొనలో అమినో యాసిడ్స్, ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి చర్మకాంతిని మెరుగు పరుస్తాయి. చర్మంపై ఎలాంటి మచ్చలు చారలు ఉణ్నా తగ్గిస్తుంది. కాబట్టి గుడ్డులోని తెల్లసొనని తీసుకుని చారలు ఉన్న ప్రదేశంలో రాయాలి. కాసేపయ్యాక ఆ మిశ్రమంపైనే ఆలివ్ ఆయిల్ రాయాలి.. ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా సమస్య తగ్గిపోతుంది. మచ్చలు, చారలు దూరం అవుతాయి.

విటమిన్ ఇ…

విటమిన్ క్యాప్సూల్‌ని తీసుకుని అందులోని ఆయిల్ తీయాలి. దీన్ని స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేయాలి. చేసి మసాజ్ చేయాలి. విటమిన్ ఇలో కొల్లాజెన్ ఉత్పత్తిని, సెల్ ప్రొడక్షన్‌ని క్రమబద్ధం చేసే గుణాలు ఉంటాయి. దీనిని రాయడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ త్వరగా తగ్గిపోతాయి..

ఆముదం..

ఆముదంలోనూ చర్మ పోషణకు ఉపయోగపడే ఎన్నో గుణాలు ఉంటాయి. ఈ ఆయిల్‌ని తీసుకుని చర్మంపై మసాజ్ చేయాిలి. ఇది స్కిన్‌కి మాయిశ్చరైజర్‌ని అందించి త్వరగా మచ్చలు, చారలను దూరం చేస్తుంది. రెగ్యులర్‌గా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.

కోకో బటర్..

ఎన్నో బ్యూటీ కాస్మెటిక్స్‌లో వాడే కోకో బటర్‌లో చర్మానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. ఇది కోకో బీన్స్ నుంచి తయారు చేసిన నేచురల్ ఫ్యాట్.. రూమ్ టెంపరేజర్‌లోనే ఇది ఇట్టే కరిగిపోతుంది. దీన్ని చర్మంపై అప్లై చేయడం వల్ల త్వరగా స్ట్రెచ్ మార్క్స్‌ని తగ్గిస్తుంది.

బరువు త్వరగా పెరగడం, తగ్గడం వంటి సమస్యల కారణంగానే ఈ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. వీటికి మార్కెట్లో దొరికే క్రీమ్స్ బదులు ఇంటి చిట్కాల ద్వారా సమస్య తగ్గించుకోవచ్చు. వీటిని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే, అలోపతి కంటే కాస్తా ఆలస్యంగా ప్రభావం చూపుతాయి. కానీ, కచ్చితంగా సమస్య చాలా వరకూ తగ్గుతుంది. వీటిని ఉపయోగించి మీ సమస్యను తగ్గించుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This