జీహెచ్​ఎంసీ ఎన్నికలు​: సెలబ్రిటీ ఓటింగ్​

కేపీహెచ్‌బీ కాలనీలో ఓటేసిన సినీనటుడు రాజేంద్రప్రసాద్.

ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి కుటుంబసమేతంగా ఓటు వేశారు. ప్రతిఒక్కరూ ఓటు వేయడం తమ బాధ్యతగా గుర్తించాలని అన్నారు.
  • ఫిల్మ్​నగర్​లో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటి మంచు లక్ష్మి.
  • కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఓటు వేయాలని సూచన.
  • ప్రతి ఒక్కరు ఓటు వేసి.. పోలింగ్ శాతం పెంచాలని విజ్ఞప్తి.

ఓటేసిన సినీ నటుడు, నిర్మాత అశోక్ కుమార్.

తరలి రండి.. ఓటేయండి

జీహెంచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్​ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం తీవ్ర కృషి చేసింది. పౌరులు పెద్ద ఎత్తున బయటకొచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నటుడు నాగార్జున, విజయదేవరకొండ, శేఖర్ కమ్ముల, నటి ఝాన్సీ, యాంకర్ సుమ తదితరులు  సినీ ప్రముఖులు కోరారు.

“భావి తరాల అభివృద్ధిని నిర్దేశించే ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని వదులుకోకూడదు. సెలవు ఇచ్చారని ఇంట్లో కూర్చోకుండా తప్పకుండా ఓటేయాలి. ఏమీ ఆశించకుండా ఓటేసినప్పుడే అభివృద్ధిపై నాయకులను ప్రశ్నించే వీలు కలుగుతుంది.”

-అలీ, హాస్యనటుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This