ఓటింగ్ పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలు: ఎన్నికల నిఘా వేదిక

స్వయం పాలన సాధ్యం కావాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల నిఘా వేదిక అభిప్రాయపడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచాలనే లక్ష్యంతో వివిధ సంస్థలతో కలిసి రూపొందించిన 30 నిమిషాల నిడివి గల డాక్యుమెంటరీ, ప్లకార్డులను… సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విడుదల చేసింది.

కేవలం వాదించడం, సోషల్‌ మీడియాలో స్పందించడమే కాకుండా… పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేయాలని ఆ సంస్థ ప్రతినిధి వివి రావు అన్నారు. బల్దియాలో ఇప్పటి వరకు 50 శాతం పోలింగ్​ మించలేదని… ఈ ఏడాది 50 శాతానికి పైగా పెంచేందుకు ఎన్నికల కమిషన్‌ అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఓటేసేందుకు నగర ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాటి పరిష్కారాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లగా… సానుకూలంగా స్పదించినట్టు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This