రూ.999తో రూ.20,000 లాభాలు.. అదిరిపోయే Vodafone ప్రీమియం ప్లాన్.. కొంతమందికి మాత్రమే!

ఒకప్పుడు రీచార్జ్ చేసుకోవాలంటే టాక్ టైం, ఎస్ఎంఎస్, డేటా అన్నిటికీ ప్రత్యేకంగా రీచార్జ్ ప్లాన్లు ఉండేవి. టాక్ టైం ప్లాన్ కి టాక్ టైం మాత్రమే వచ్చేది. మిగతా వాటికి కూడా అంతే. కానీ జియో వచ్చాక పరిస్థితి మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. టాక్ టైం, ఎస్ఎంఎస్, డేటాతో పాటు సరికొత్త పాటల కోసం జియో మ్యూజిక్, టీవీ కోసం జియో టీవీ, జియో సినిమా పేరిట ఓ స్ట్రీమింగ్ సర్వీస్ కు సంబంధించిన యాక్సెస్ కూడా ఒకే రీచార్జ్ తో రావడం ప్రారంభమైంది. దీంతో టెలికాం రంగంలో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. క్రమంగా టెలికాం కంపెనీలు తమ రీచార్జ్ ల్లో ఓటీటీ యాప్స్ ను కూడా చేర్చడం మొదలు పెట్టాయి. ఇప్పుడు వొడాఫోన్ దాన్ని తర్వాత స్థాయికి తీసుకువెళ్లింది. తన ప్రీమియం ప్లాన్ ద్వారా ప్రముఖ ఓటీటీ యాప్స్ అయిన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5 వంటి సర్వీసుల సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తోంది. మరి ఆ ప్లాన్ ఏంటి? దాంతో ఇంకేం అదనపు లాభాలు ఉన్నాయి?

వొడాఫోన్ రూ.999 RedX ప్లాన్ వివరాలు ఇవే!
ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ కోసం మీరు ప్రతి నెలా రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. అయితే దానికి గానూ మీకు రూ.20,000 విలువైన లాభాలు పొందవచ్చు. అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, 150 జీబీ అన్ లిమిటెడ్ డేటా లభిస్తుంది. వీటితో పాటు నెట్ ఫ్లిక్స్(నెలకు రూ.500), అమెజాన్ ప్రైమ్, జీ5, వొడాఫోన్ ప్లే వంటి స్ట్రీమింగ్ సర్వీసులకు సంవత్సరం పాటు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తారు. 2020 జనవరి 31 లోపు రీచార్జ్ ఈ ప్లాన్ తీసుకునే వారికి అదనంగా ఐదు శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా సంవత్సరానికి నాలుగు ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ లను అందిస్తారు. వీటిని ఒక్కో త్రైమాసికంలో ఒక్కోటి ఉపయోగించుకోవచ్చు.

వీటిలో పాటు Hotels.com వెబ్ సైట్ లో హోటల్ రూములు బుక్ చేసుకుంటే.. వాటిపై 15 శాతం తగ్గింపు లభించనుంది. శాంసంగ్ ఇండియా ఆన్ లైన్ స్టోర్ లో ఎంపిక చేయబడ్డ మొబైల్స్ పై RedX వినియోగదారులకు ప్రత్యేక తగ్గింపు లభించనుంది. ఈ ఆఫర్ ఒక్కో వినియోగదారుడికి ప్రతి ఆరు నెలల్లో రెండు సార్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా అంతర్జాతీయ కాల్స్ ను కేవలం 50 పైసలకే చేసుకోవచ్చు. మై వొడాఫోన్ యాప్ ద్వారా ఈ ప్లాన్ ను బుక్ చేసుకోవచ్చు.

కొందరికి మాత్రమే!
అయితే ఈ ప్లాన్ ను ముందుగా కొంతమందికి మాత్రమే అందించనున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్లాన్ ను అందిస్తామని వొడాఫోన్ తమ అధికారిక సైట్ లో పేర్కొంది. అయితే ఈ ప్లాన్ ను కనీసం ఆరు నెలల పాటు సబ్ స్క్రైబ్ చేసుకోవాలని వొడాఫోన్ తన నిబంధనల్లో పేర్కొంది. ఆరు నెలల లోపు ఈ ప్లాన్ ను క్యాన్సిల్ చేసుకున్నట్లయితే వారి నుంచి రూ.3,000 చార్జీలు వసూలు చేస్తామని పేర్కొంది.

దీన్ని తీసుకోవచ్చా?
మీరు ఒకవేళ ఇంట్లోకి బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ కోసం చూస్తున్నట్లయితే.. మీరు ఈ ప్లాన్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా ఇంట్లో ఒక వైఫై హాట్ స్పాట్ ను సృష్టించుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఏ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ని తీసుకున్నప్పటికీ కనీసం రూ.600 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. దాని కంటే ఒక రూ.400 అదనంగా పెడితే ఏటా ఎంతో ఖర్చు పెట్టి కొనుగోలు చేయాల్సిన(ఒకవేళ వాటిని తీసుకునే ఆలోచన ఉంటే) నెట్ ఫ్లిక్స్(సంవత్సరానికి రూ.5,998), అమెజాన్ ప్రైమ్(ఏటా రూ.1,000), జీ5(ఏటా రూ.1,000) వంటి వాటిని ఉచితంగా పొందవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్ పై అదనంగా లభించే లాభాలను కూడా అందుకోవచ్చు. కాబట్టి ఈ ప్లాన్ మీరు పెట్టే నగదుకు సరిపడా విలువను అందిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This