విశాఖ తీరంలో సందిగ్ధం.. అమోనియం నైట్రేట్ దిగుమ‌తిపై అయోమయం!

విశాఖపట్నం సముద్ర తీరంలో అయోమయ స్థితి కొనసాగుతోంది. అమోనియం నైట్రేట్ నిల్వలతో తీరానికి చేరుకున్న 3 నౌకలు.. ఇందుకు కారణమయ్యాయి. ఈ నెల 29న మరో నౌక సైతం విశాఖ తీరానికి చేరుకోనుంది. ఇక్కడి వరకూ బానే ఉంది కానీ.. నౌకల నుంచి అమోనియం నైట్రేట్ ను దిగుమతి చేయడానికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి

అమోనియం నైట్రేట్ ను హ్యాండ్లింగ్ చేసే శ్రావణ్​ షిప్పింగ్‌కు ఎన్‌ఓసీని న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌రేట్ ర‌ద్దు చేసింది. షోకాజ్ నోటీసుకు నిర్ణీత గ‌డువులో స‌మాధానం ఇవ్వనందున ఎన్‌ఓసీని రద్దు చేసినట్లు సీపీ తెలిపారు. మరోవైపు.. ఈ రసాయనాన్ని దిగుమ‌తి చేసే ఏకైక పోర్టు విశాఖే అయిన కారణంగా.. ఎరువులు, మైనింగ్ పరిశ్రమలు.. ఆశలు పెట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This