విశాఖ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదంలో ఒకరు మృతి

అగ్నిప్రమాదంలో ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ పరవాడ రాంకీ ఫార్మాసిటీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఉద్యోగి మృతి చెందాడు. సాల్వెంట్స్‌ ఫార్మా కంపెనీలో రాత్రి విధుల్లోకి వెళ్లిన కాండ్రేగుల శ్రీనివాస్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

శ్రీనివాస్​ పరిశ్రమలో సీనియర్​ కెమిస్ట్​గా  విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి విధుల్లోకి వెళ్లిన అతని​ ఆచూకీ లభించలేదు. ప్రమాద స్థలి వద్ద పూర్తిగా కాలి ఉన్న మృతదేహం వీడియో బయటకు రావటంతో ఉద్యోగి మృతి చెందిన విషయం వెలుగుచూసింది. అయితే అధికారికంగా దీనిని ఎవరూ ధ్రవీకరించలేదు. ఈ ఘటనలో మరో ఉద్యోగి మల్లేశ్వరరావు గాజువాక ఆర్కే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమించటంతో విశాఖలో ఓ కార్పోరేట్​ ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This