రాష్ట్రంలో మళ్లీ పదివేలకు పైగా కరోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య 1,86,461

రాష్ట్రంలో కరోనా రోజురోజుకీ ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో(9ఏఎం-9ఏఎం) ఒక్క రోజులోనే 10,128 కేసులు కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 77 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,86,461కు, మొత్తం మరణాలు 1,681కు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 60,576 మందికి కరోనా పరీక్షలు చేశారు. గత 24 గంటల్లో 8,729 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 1,04,354గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 80,426 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

తాజాగా కొవిడ్‌ వల్ల గుంటూరులో 16 మంది, విశాఖపట్నంలో 12, శ్రీకాకుళంలో 10, చిత్తూరు ఎనిమిది, తూర్పుగోదావరిలో ఏడుగురు, కృష్ణాలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, కర్నూలులో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కడపలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 22,35,626 సాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This