రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 7,948 కేసులు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో 7,948 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. మొత్తం బాధితుల సంఖ్య 1,10,297కు చేరింది. మహమ్మారి బారిన పడి మరో 58 మంది మృతి చెందగా.. ఇప్పటివరకూ 1,148 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో కరోనా యాక్టివ్​ కేసులు సంఖ్య 56,527కు చేరింది. కొవిడ్​ నుంచి 52,622 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 62,979 నమూనాలను పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ 17.49 లక్షల నమూనాలను పరీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This