రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1610 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 57,142కు చేరింది. తాజాగా కొవిడ్​తో 9 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 480కి పెరిగింది.  సోమవారం కరోనా నుంచి కోలుకుని 803 మంది డిశ్చార్జయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్​ నుంచి కోలుకున్న వారి సంఖ్య 42,909కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో  13,753 యాక్టివ్‌ కేసులున్నాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 531 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 172, వరంగల్​ అర్బన్​ 152, మేడ్చల్​ 113, నిజామాబాద్​ 58, కరీంనగర్​ జిల్లాలో 48 కేసులు నమోదయ్యాయి.

హైకోర్టు అసంతృప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బులిటన్​ ఫార్మాట్​ను కొత్త పంథాలోకి మార్చింది. 59 పేజీలతో కూడిన బులిటన్ విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This