భారత్​లో 12 లక్షలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అంతులేకుండా కొనసాగుతోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా రికార్డు స్థాయిలో 37,724 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 648 మంది మహమ్మారి బారినపడి మృతిచెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 28 వేలు దాటగా… కేసుల సంఖ్య 12 లక్షలకు చేరువైంది.

ఆయా రాష్ట్రాలలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోందిలా…

  • మహారాష్ట్రలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,27,031కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 12,276 మంది వైరస్ ధాటికి బలయ్యారు.
  • తమిళనాడులో వైరస్​ బాధితుల సంఖ్య 1,80,643కి చేరింది. మొత్తంగా 2,626 మంది కొవిడ్​ బారినపడి మృతి చెందారు.
  • దిల్లీలో కొవిడ్​ కేసుల సంఖ్య 1,25,096గా ఉంది. మొత్తంగా 3,690 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
  • గుజరాత్​లో వైరస్​ కేసుల సంఖ్య 50 వేలు దాటగా.. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 2,196 మంది వైరస్​ కారణంగా చనిపోయారు.

స్పెయిన్​ను దాటి 7వ స్థానానికి భారత్​

కరోనా మరణాల్లో.. తాజాగా స్పెయిన్​ను​ దాటి ఏడో స్థానానికి చేరింది భారత్​. స్పెయిన్​లో ఇప్పటివరకు 28,424 మంది మృతిచెందగా.. బుధవారం నాటి మరణాలతో కలిపి భారత్(28,732)..​ ఆ దేశాన్ని అధిగమించినట్లయింది. ఈ జాబితాలో అమెరికా టాప్​లో ఉండగా, బ్రెజిల్​ రెండో స్థానంలో ఉంది. అయితే కరోనా కేసుల్లో మాత్రం భారత్​ మూడో స్థానంలో కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This