కరోనా వేళ… ఎంసెట్​ ఎలా? విద్యార్థుల్లో సందేహాలు

రాష్ట్రంలో ఎంసెట్‌ నిర్వహణపై అభ్యర్థులు, తల్లిదండ్రుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 27 నుంచి నిర్వహించాలని ఉన్నత విద్యామండలి గతంలోనే నిర్ణయించగా కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఆలోచనలో పడ్డారు. కుటుంబసభ్యుల్లో ఎవరికైనా కరోనా సోకి ఉంటే పరీక్షకు విద్యార్థి హాజరు కావొచ్చా.? అభ్యర్థికే కరోనా సోకి ఉంటే పరీక్ష ఎలా రాయాలి? అసలు ఈ నెల్లో ఎంసెట్‌ ఉంటుందా. ఉండదా? అంటూ… కొన్ని రోజులుగా విద్యార్థుల నుంచి సహాయకేంద్రాలకు ఫోన్లు.. అధికారులకు ఈ మెయిళ్లు హోరెత్తుతున్నాయి.

కేంద్రాలు మార్పు

ఏపీ-ఎంసెట్‌కు మొత్తం 2 లక్షల 71 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మొదట 167 పరీక్ష కేంద్రాలు కేటాయించగా ప్రస్తుతం ఈ సంఖ్య 146కు తగ్గింది. మరోవైపు విద్యాసంస్థల మూసివేతతో చాలామంది విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. పరీక్ష కేంద్రాలను మార్చుకునే అవకాశం కల్పించడం వల్ల చదువుతున్న నగరాల బదులు సొంతజిల్లాలను ఎంచుకున్నారు. ఫలితంగా విజయవాడలో పరీక్షా కేంద్రాల తగ్గి ఆయా జిల్లాల్లో పెరిగింది. ఇప్పటివరకు సుమారు 15 వేలమంది ఇలా పరీక్షాకేంద్రాలు మార్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This