దేశంపై కరోనా పంజా.. రికార్డు స్థాయిలో 24,879కేసులు

దేశంపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో 24,879 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. ఒక్కరోజులో మరో 487మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మహారాష్ట్రలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2,23,724కి చేరింది. 9,448మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 1,22,350కు పెరిగింది. 1,700మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కరోనా కేసుల సంఖ్య 1,04,864గా ఉంది. మొత్తంగా 3,213మంది మృతి చెందారు.
  • గుజరాత్​లో మొత్తంగా 38,333మందికి వైరస్ నిర్ధరణ అయింది. 1,993మంది కరోనా కారణంగా చనిపోయారు.

పరీక్షలు..

బుధవారం వరకు మొత్తం 1,07,40,832 కరోనా పరీక్షలు జరిపినట్టు ఐసీఎంఆర్​ వెల్లడించింది. బుధవారం ఒక్క రోజే 2,67,061 నమూనాలను పరీక్షించినట్టు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This