ఒక్కరోజులో 22,752 కరోనా‬ కేసులు.. 482 మరణాలు

దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, కర్ణాటకలో కేసుల పెరుగుదల తీవ్రంగా ఉంది. దేశంలో కరోనా వైరస్ ధాటికి మరో 482మంది బలయ్యారు. కొత్తగా 22,752 మందికి కరోనా నిర్ధరణ అయింది.

  • మహారాష్ట్రలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2,17,121కి చేరింది. 9250మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 1,18,594కు పెరిగింది. 1,636 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కరోనా కేసుల సంఖ్య 1,02,831 గా ఉంది. మొత్తంగా 3,165మంది మృతి చెందారు.
  • గుజరాత్​లో మొత్తంగా 37,550 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 1,977 మంది కరోనా కారణంగా చనిపోయారు
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి 4లక్షల 73వేలమందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఒక్క మంగళవారం రోజే 2,62,679 పరీక్షలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This