కొత్త వైరస్​’ జీ-4′ సాధారణమైనదేనట.. చైనా ప్రకటన

చైనా పరిశోధకులు తాజాగా గుర్తించిన మరో వైరస్ ‘జీ-4’ సర్వ సాధారణమైనదేనని ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రకటించారు. 2009లో ప్రబలిన మహమ్మారి స్వైన్​ ఫ్లూ (హెచ్​1ఎన్​1) జాతికి చెందిన ఈ వైరస్​పై మరింత అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు.

“జీ-4 వైరస్​కు సంబంధించి దేశీయ పరిశోధకులు చేసిన అధ్యయనం శాంపిల్ చాలా చిన్నది. ఇది మహమ్మారిగా ప్రబలే అవకాశాన్ని ఈ పరిశోధనతో నిర్ధరించలేం. అయినప్పటికీ సంబంధిత శాఖలు, నిపుణులు ఆ వైరస్​పై పర్యవేక్షణ పెంచుతారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ప్రయత్నిస్తారు.”

– ఝావో లిజియాన్​, చైనా విదేశాంగ శాఖ

చైనా పరిశోధకులు గుర్తించిన ఈ వైరస్‌కు ‘జీ-4’గా నామకరణం చేశారు. 2009లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన హెచ్‌1ఎన్‌1 వైరస్‌ జాతి నుంచే ఇది ఉద్భవించినట్లు పరిశోధకులు గుర్తించారు. “మనుషులకు సోకడానికి అవసరమయ్యే లక్షణాలన్నీ ఈ వైరస్‌లో ఉన్నట్లు గుర్తించాం” అని అధ్యయనంలో పాల్గొన్న చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు, చైనా ‘వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం'(సీడీసీ) శాస్త్రవేత్తలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This