ఒకే ఇంట్లో నలుగురికి కరోనా

హైదరాబాద్​లోని బంజారాహిల్స్ రోడ్​ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో ఒకే ఇంట్లో నలుగురికి కరోనా సోకింది. కొంపల్లిలో బంధువు అంత్యక్రియలకు వెళ్లొచ్చిన ఓ విద్యార్థికి 3 రోజుల క్రితం జ్వరం, జలుబు లక్షణాలు కనిపించాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. ఫలితంగా విద్యార్థి తండ్రి, తల్లితో పాటు అతని సోదరికీ పరీక్షలు నిర్వహించారు. వారికీ కరోనా పాజిటివ్​ అని తేలడం వల్ల అందరినీ అక్కడే ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేయిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

ఆ ఇంట్లోని మిగిలిన కుటుంబ సభ్యులతో పాటు ఆ ఇంటి వాచ్​మెన్ కుటుంబాన్నీ హోం క్వారంటైన్​లో ఉండాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటి వరకు బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తాజాగా ఎమ్మెల్యే కాలనీలో ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్ అని తేలడం వల్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ప్రైవేట్​ వైద్యురాలికి పాజిటివ్..

బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యుడికి 3 రోజుల క్రితం కరోనా సోకగా.. అదే ఆస్పత్రిలో పనిచేస్తూ గ్రీన్ బంజారా కాలనీలో నివాసం ఉంటున్న మరో వైద్యురాలికి సైతం తాజాగా కరోనా సోకింది. వైద్యురాలు బంజారాహిల్స్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This