24 గంటల్లో మరో 18522 కేసులు.. 418 మరణాలు

దేశంలో కరోనా కలవరపెడుతోంది. రోజురోజుకూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 24 గంటల్లోనే 18 వేల 522 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 418 మంది కొవిడ్​కు బలయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

  • వైరస్​ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో కేసులు లక్షా 69 వేలు దాటాయి. మరణాల సంఖ్య 7,610గా ఉంది.
  • తమిళనాడులో 86 వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. మొత్తం 1141 మరణాలు సంభవించాయి.
  • గుజరాత్​లో 1827, దిల్లీలో 2,680 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This