తెలంగాణలో 82,458 మందికి కరోనా పరీక్షలు.. 14,419కి చేరిన బాధితులు

తెలంగాణలో కొవిడ్‌ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం మరో 983 మందికి వైరస్‌ సోకినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 14,419కు చేరింది. కొత్త కేసుల్లో జీహెచ్​ఎంసీ పరిధిలోనే 816 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి.

జిల్లాల్లో..

రంగారెడ్డి జిల్లాలో47 కేసులు, మంచిర్యాల జిల్లాలో 33, మేడ్చల్‌ 29, వరంగల్‌ రూరల్‌ 19, వరంగల్‌ అర్బన్‌లో 12 మందికి వైరస్‌ సోకింది. భద్రాద్రిలో 5 కేసులు, నల్గొండ, కరీంనగర్‌, సిద్దిపేట, ఖమ్మం జిల్లాలో మూడు చొప్పున కేసులు వెలుగుచూశాయి. ఆదిలాబాద్‌, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో రెండేసి.. సంగారెడ్డి, జనగామ, మహబూబ్‌నగర్‌, మెదక్, సూర్యాపేట, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

247కు చేరిన మృతులు..

రాష్ట్రంలో ఆదివారం నలుగురు చనిపోగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 247కు చేరింది. మరో 244మంది డిశ్చార్జ్ అయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 5,172కి చేరింది. 9 వేల మంది చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఆదివారం మరో 3,227 మందికి కరోనా పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 82,458 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ వివరించింది

టిమ్స్​ సందర్శన..

రాష్ట్రంలో కరోనా కట్టడి నియంత్రణా చర్యలను పర్యవేక్షించేందుకు రాష్ట్రానికి వచ్చిన లవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని కేంద్ర బృందం… నేడు పలుప్రాంతాల్లో పర్యటించనుంది. ఉదయం టిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించనుంది. గాంధీ ఆస్పత్రి, దోమల్‌గూడా కంటైన్మెంట్ జోన్లను పరిశీలించిన తర్వాత సచివాలయంలో వైద్యారోగ్య అధికారులతో సమావేశం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This