ఒక్కరోజులో 19,459 కేసులు, 380 మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 19,459 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 380 మంది వైరస్​కు బలయ్యారు.

  • మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 1,64,626కు చేరింది. 7,429 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,6575 మంది కోలుకున్నారు.
  • తమిళనాడులో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 82,275కు చేరింది. 1079 మంది మృతి చెందారు. 35,659 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.
  • దిల్లీలో కేసుల సంఖ్య 83,077కి చేరింది. మొత్తం 2,623 మంది ప్రాణాలు కోల్పోయారు. 52,607 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. 27,847మంది చికిత్స పొందుతున్నారు.
  • గుజరాత్​లో వైరస్​ కేసుల సంఖ్య 31,320కు చేరింది. ఇప్పటివరకు 1,808 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6,712 మంది చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This