ప్రపంచవ్యాప్తంగా 93లక్షల 54వేలు దాటిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ ఉద్ధృతమవుతోంది. ఇప్పటి వరకు 93లక్షల 54వేల 326 మంది వైరస్ బారినపడ్డారు. 4లక్షల 79వేల 816మందిని మహమ్మారి బలిగొంది. 50లక్షల 41వేల813 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. వైరస్​ ప్రభావం అధికంగా ఉన్న లాటిన్​ అమెరికా, కరేబియన్​ దేశాల్లో మరణాల సంఖ్య లక్ష దాటినట్లు గణాంకాలు వెల్లడించాాయి.

కరోనా దెబ్బకు అతలాకుతలమైన అగ్రరాజ్యం అమెరికాలో కేసుల సంఖ్య 24లక్షల 24వేలు దాటింది. లక్షా 23వేల మందికిపైగా ప్రాాణాలు కోల్పోయారు. వైరస్​ ఉగ్రరూపం దాల్చుతున్న బ్రెజిల్​లో బాధితుల సంఖ్య 11లక్షల 51వేలు దాటగా.. మృతుల సంఖ్య 53వేలకు చేరువలో ఉంది.

మాస్కు లేకపోతే 25 డాలర్లు ఫైన్​..

కరోనా కేసుల సంఖ్యను కట్టడి చేసేందుకు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది అమెరికా దక్షిణ కరోలినాలోని గ్రీన్​విల్లే నగరం. రెస్టారెంట్లు, రిటైల్​ స్టోర్లు, సెలూన్లు, సూపర్​ మార్కెట్లలోని సిబ్బంది కచ్చితంగా మాస్కులు ధరించేలా నిబంధనలను అమలు చేసింది. సూపర్​ మార్కెట్లు, మెడికల్ షాపులకు వెళ్లే వారాకి తప్పనిరిగా మాస్కులు ఉండాలి. ఈ నిబంధనలను అతిక్రమిస్తే 25డాలర్ల వరకు జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు.

దేశం కేసులు మరణాలు
1 అమెరికా 24,24,168 123,473
2 బ్రెజిల్ 11,51,479 52,771
3 రష్యా 5,99,705 8,359
4 భారత్ 4,56,183 14,476
5 బ్రిటన్ 3,06,210 42,927
6 స్పెయిన్ 2,93,832 28,325
7 పెరు 2,60,810 8,404
8 చిలీ 2,50,767 4,505
9 ఇటలీ 2,38,833 34,675
10 ఇరాన్​ 2,09,970 9,863

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This