దేశంలో మరో 14,933 కరోనా కేసులు‬, 312 మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. వైరస్​ కారణంగా మరణించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 14,933 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 312 మంది వైరస్​కు బలయ్యారు.

  • మహారాష్ట్ర, దిల్లీల్లో కరోనా స్వైరవిహారం చేస్తోంది. మహారాష్ట్రలో వైరస్ బాధితుల సంఖ్య మొత్తంగా 1,35,796కు చేరింది. 6,283 మంది మహమ్మారికి బలయ్యారు.
  • గుజరాత్​లో మొత్తం కేసుల సంఖ్య 27,880కి పెరిగింది. మరణాలు 1,685కు చేరాయి.
  • దిల్లీలో మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 62,655కు పెరిగింది. చనిపోయినవారి సంఖ్య 2,223కు చేరింది.
  • తమిళనాడులో బాధితుల సంఖ్య 62,087కి పెరిగింది. వైరస్​ సోకి మొత్తం 794 మంది మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This