దాడి చేశాకే తీవ్రత తెలిసేది.. సెకండ్‌వేవ్‌కు అదే కారణం

ఫస్ట్‌వేవ్‌ తర్వాత జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంతో సెకండ్‌వేవ్‌కు కారణ మైన విధంగానే మళ్లీ వ్యవహరిస్తే.. థర్డ్‌వేవ్‌ను చేజేతులా మనమే ఆహ్వానించినట్టు అవుతుందని ఢిల్లీ లోని ఎయిమ్స్‌ పల్మనరీ క్రిటికల్‌ కేర్‌ మాజీ విభాగాధిపతి, పీఎస్‌ఆర్‌ఐ ఇనిస్టిట్యూట్‌ అండ్‌ హాస్పిటల్‌ ఆఫ్‌ పల్మనరీ, స్లీప్‌మెడిసిన్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ జీసీ ఖిల్‌నానీ పేర్కొన్నారు. కోవిడ్‌ మహమ్మారి ఉధృతి తగ్గుతున్నా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు తీవ్రత పెరగడానికి ప్రధాన కారణమైన డెల్టా వేరియంట్, ఇతర వేరియంట్లను టీకాలు పూర్తిస్థాయిలో అడ్డుకోలేక పోవడం ఆందోళన కలిగిస్తున్న అంశమని అన్నారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఒక్క టే మార్గమని స్పష్టం చేశారు. దేశంలో రెండు డోసుల టీకా తీసుకున్న జనాభా కూడా 4 శాతం లోపే ఉండడాన్ని ప్రత్యేకంగా గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రెండుడోసుల టీకా తీసుకున్న 5 నుంచి 10 శాతం మందికి కోవిడ్‌ నుంచి రక్షణ లభించడం లేదని, దాదాపు 27% జనాభాలో ఇన్ఫెక్షన్లు సోకినా లక్షణాలు కనిపించడం లేదని (అసింప్టమాటిక్‌), వైరస్‌లలో 64% దాకా వేరియెంట్లు (మ్యూటెంట్లు) ఆందోళనకు కారణమవుతున్నట్టుగా అమెరికాలోని సీడీసీ అధ్యయనం పేర్కొన్న విషయాన్ని ఆయన ఉటంకించారు. కొన్ని వేరియంట్లపై వ్యాక్సిన్‌ పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వల్ల రెండో డోసు తీసుకునే వ్యవధిని తగ్గించాలని ఇటీవల లాన్‌సెట్‌ జర్నల్‌ తన అధ్యయనంలో స్పష్టం చేసిందంటున్న ఖిల్‌నానీతో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This