ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే లక్షా 83వేల కేసులు

ప్రపంచంపై కరోనా కరాళనృత్యం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం రోజు రికార్డు స్థాయిలో పాజిటివ్​ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అన్ని దేశాలు ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం లక్షా 83వేలకుపైగా కేసులు వెలుగు చూసినట్లు పేర్కొంది. ఒక్క రోజులో 4వేల 743మంది ప్రాణాలు కోల్పొయినట్లు వెల్లడించింది. పరీక్షల సంఖ్య పెరిగినందు వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అదివారం ప్రకటించిన కేసుల్లో అత్యధికంగా బ్రెజిల్​లో 54వేల 771 నమోదైనట్లు డబ్ల్యూహెచ్​వో వివరించింది. 36వేల617 కేసులతో అమెరికా, 15,400 కేసులతో భారత్​ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచినట్లు తెలిపింది. కొత్తగా సంభవించిన మరణాల్లో 70శాతం అమెరికా దేశాలకు చెందినవిగా పేర్కొంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 90 లక్షల 44వేల 563కు చేరింది. వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4లక్షల 70వేల 665కి పెరిగింది. మహమ్మారి బారినపడి 48లక్షల 37వేల 952మంది కోలుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This