దేశంలో 24 గంటల్లో 14,821 కేసులు.. 445 మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. వైరస్​ కారణంగా మరణించే వారి సంఖ్య కూడా అధికమవుతోంది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 14,821 కేసులు నమోదయ్యాయి. మరో 445 మంది వైరస్​కు బలయ్యారు.

దేశంలో మొత్తం కొవిడ్-19 బాధితుల సంఖ్య 4,25,282కు చేరింది. ఇప్పటి వరకు కరోనా కాటుకు 13,699 మంది బలయ్యారు. కరోనా నుంచి 2,37,195 మంది కోలుకున్నారు. 1,74,387 మంది చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This