‘టీకా తీసుకున్నా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి’

దేశవ్యాప్తంగా కోరనా వ్యాక్సిన్ పంపిణీ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధికారుల సన్నద్ధతపై శుక్రవారం సాయంత్రం దిల్లీలో సమీక్ష నిర్వహించారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​. విజ్ఞాన్​ భవన్​లో ఏర్పాటు చేసిన కొవిడ్​ కంట్రోల్​ రూంను పరిశీలించారు. టీకా నిర్వహణకు ప్రభుత్వం ఉపయోగించే కొవిన్​ యాప్​పై అధికారులతో చర్చించారు. స్వదేశంలో అభివృద్ధి చేసిన ఆక్స్​ఫర్డ్​ ఆస్ట్రాజెనెకా- కొవిషీల్డ్, బారత్​బయోటెక్​-కొవాగ్జిన్ టీకాలు 100శాతం సురక్షితమైనవి హర్షవర్ధన్ మరోసారి స్పష్టం చేశారు.

భారత వాతావరణ శాఖ 146వ వ్యవస్థాపక దినోత్సవంలోనూ ఆరోగ్యమంత్రి పాల్గొన్నారు. కరోనా మహమ్మారి అంతానికి వాక్సినేషన్​ ప్రక్రియ ఆరంభమని చెప్పారు. టీకాలు తీసుకున్న తర్వాత కూడా ప్రజలు కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This