కరోనా విలయం: మరో 7లక్షల పాజిటివ్​ కేసులు నమోదు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 14వేల మంది కరోనా బాధితులు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 20 లక్షలు దాటింది. ఒక్కరోజు వ్యవధిలో 7.2 లక్షల కొత్త కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 9 కోట్ల 34 లక్షలకు ఎగబాకింది. ప్రస్తుతానికి 2 కోట్ల 47లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. 6కోట్ల 67లక్షల మంది మహమ్మారిని జయించి ఇంటికి వెళ్లారు.

ఈ దేశాల్లో పరిస్థితి ఇలా..

  • అమెరికాలో కరోనా మరణ మృదంగం కొనసాగుతుంది. తాజాగా 3,847 మంది మహమ్మారి బారినపడి మరణించారు. కొత్తగా 2 లక్షల పాజిటివ్​ కేసులు బయటపడగా..మొత్తం కేసులు 2కోట్ల 38లక్షలకు పెరిగాయి.
  • యూకేలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా 48 వేల కొత్త కేసులు నమోదుకాగా.. 1,248మంది మరణించారు.
  • బ్రెజిల్​లో 68వేల కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 1,151 మంది కరోనా బాధితులు మరణించారు.
  • రష్యాలో తాజాగా 24వేల పాజిటివ్​ కేసులు బయటపడ్డాయి. మరో 570మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
  • స్పెయిన్​లో పాజిటివ్​ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా 35 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. 201మంది కరోనా రోగులు మృతి చెందారు.
  • జర్మనీలో 1,088 మంది కరోనా బారినపడి మరణించారు. కొత్తగా 22,931మందికి పాజిటివ్​గా నమోదైంది.
  • మెక్సికోలో కరోనా మరణాల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా 1,235మంది వైరస్​ బారిన పడి మరణించారు. 15,873 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This