దేశవ్యాప్తంగా కొత్తగా 22,272 కరోనా కేసులు​

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 22,272 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. బాధితుల సంఖ్య 1కోటీ 1లక్షా 69వేల 118కి చేరింది. వైరస్​ సోకినవారిలో కొత్తగా 251 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 1లక్షా 47వేల 343కు చేరింది.

రికవరీ రేటు ఇలా..

తాజాగా 22వేల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు. ఫలితంగా కరోనాను జయించిన వారి సంఖ్య 97లక్షల 40వేల 108కి చేరింది. 2లక్షల 81వేల 667 యాక్టివ్​ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 95.78 శాతానికి ఎగబాకింది. మరణాల రేటు స్థిరంగా 1.45 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 8లక్షల 53వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) వెల్లడించింది. ఫలితంగా మొత్తం టెస్ట్​ల సంఖ్య 16కోట్ల 71లక్షలు దాటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This