నివురుగప్పిన కరోనా… పొంచి ఉన్న రెండో దశ

భారత్‌లోనూ దిల్లీ, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో పంజా విసురుతోంది. దిల్లీ, కేరళ, మహారాష్ట్రల్లో రోజుకు 5 వేలకు పైగా కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి. వ్యక్తిగతంగా స్వీయ జాగ్రత్తలను ఉల్లంఘించడంతో పాటు చలి తీవ్రత, కాలుష్యమూ ఇందుకు కారణమైందని భావిస్తున్నారు.

తెలంగాణలోనూ రెండో దశ ఉద్ధృతిపై ఆందోళన నెలకొంది. వాస్తవానికి రాష్ట్రంలో సెప్టెంబరు నుంచి కేసులు తగ్గుముఖం పట్టాయి. గతంలో రోజుకు సుమారు 3 వేల వరకు కేసులు నమోదు కాగా.. ఇప్పుడు 800-1200 వరకూ నమోదవుతున్నాయి. జూన్‌లో పాజిటివ్‌ రేటు 23 శాతం వరకూ చేరుకోగా.. ఇప్పుడు 3 శాతం లోపు ఉంది. కేసుల సంఖ్య తగ్గినా వైరస్‌ ముప్పు పూర్తిగా తొలగిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గత 2 వారాలుగా ఎన్నికల సందడి నెలకొనడంతో.. ఆ ప్రభావం వైరస్‌ వ్యాప్తిపై పడే ప్రమాదముందని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా, యూరప్‌ దేశాల్లో కంటే మూణ్నెల్ల తర్వాత మన దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి కనిపించింది. ఆయా దేశాల్లో నాలుగు వారాల నుంచి రెండో ఉద్ధృతి విరుచుకుపడుతుండడంతో.. మన దగ్గర కూడా మరో 4-6 వారాల్లో వైరస్‌ తీవ్రత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This