భారత్​ బయోటెక్​ కొవాగ్జిన్​ ప్రయోగాలు ఇలా

కరోనా మహమ్మారి… ప్రపంచదేశాలను వణికిస్తోంది. లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే పరిష్కారమని ప్రపంచమంతా అని భావిస్తున్న సమయంలో భారత్​లో ఇండిజినిస్ వ్యాక్సిన్ తయారీకి ముందుకు వచ్చిన భారత్ బయోటెక్… కొవాగ్జిన్ కాండీడ్​ను రూపొందించింది. ఎన్ఐఎన్, ఐసీఎంఆర్​తో కలిసి భారత్ బయోటెక్ ఈ టీకాను తయారు చేస్తోంది. కొవాగ్జిన్ కాండీడ్​ను ముందుగా రీసస్ కోతులపై ప్రయోగాలు చేసి అద్భుత ఫలితాలు సాధించింది. మనషులపై ప్రయోగాలకు భారత్ ఔషధ నియంత్రణ మండలి… భారత్ బయోటెక్​కు అనుమతులు జారీ చేసింది.

26వేల మందిపై మూడో దశ ట్రయల్​

ఈ ఏడాది.. జులైలో మొదటి సారి దేశ వ్యాప్తంగా 12 కేంద్రాల్లో… 375 మందిపై తొలివిడత ప్రయోగాలు నిర్వహించారు. 14 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా ఇచ్చిన వ్యాక్సిన్ డోస్ సత్ఫలితాలు ఇచ్చినట్టు భారత్ బయోటెక్ ప్రకటించింది. అనంతరం సెప్టెంబర్​లో 750 మందిపై నిర్వహించిన రెండో దఫా ట్రాయల్స్ కూడా సత్ఫలితాలను ఇవ్వడంతో… ఈ నెల మొదటి వారం నుంచి దేశ వ్యాప్తంగా 25 కేంద్రాల్లో… 26 వేల మందిపై మూడో దశ ప్రయోగాలు నిర్వహిస్తోంది భారత్ బయోటెక్.

ఆ దేశాలు మినహా టీకా సరఫరాకు హక్కులు

కొవాగ్జిన్​తో పాటు నాజర్ స్ప్రే, మోనోక్లోనల్ యాంటీ బాడీస్ థెరపుటిక్స్ తయారీపై పరిశోధనలు చేస్తోంది భారత్ బయోటెక్. ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు కోసం వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ మెడిసిన్​తో ఒప్పందం చేసుకుంది. అమెరికా, జపాన్, ఐరోపా మినహా ప్రపంచ దేశాల్లో టీకా సరఫరా హక్కులు సాధించింది. చింపాంజీ.. అడినో వైరస్ ఆధారంగా దీనిని తయారు చేస్తున్నారు. న్యూ మిలినియం టెక్నాలజీ లీడర్షిప్ ఇనిషియేటివ్, నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రీ డొమిక్స్ సంస్థలతో కలిసి… కొవిడ్​పై అత్యంత ప్రభావవంతంగా పనిచేసే… హ్యూమన్ మోనోక్లోనల్ యాంటీ బాడీలను తయారు చేస్తోంది. ఫలితంగా కొవిడ్​ను ఎదుర్కోవడం కోసం కావాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్​లపై ప్రయోగాలు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This