డొనాల్డ్​ ట్రంప్​ కుమారుడికి కరోనా పాజిటివ్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కుమారుడు బారన్​ ట్రంప్​(14)కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ మేరకు ట్రంప్​ సతీమణి మెలానియా.. శ్వేతసౌధం వెబ్​సైట్​లో వెల్లడించారు. అయితే బారన్​కు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తెలిపారు. ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్​, మెలానియాకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే చికిత్స తర్వాత ట్రంప్, మెలానియాలు కోలుకున్నారు. అనంతరం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ తిరిగి పాల్గొంటున్నారు ట్రంప్​.

” మరోమారు పరీక్షలు చేశాక పాజిటివ్​గా తేలింది. అదృష్టం కొద్ది ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కరోనా వల్ల ముగ్గురం కలిసి ఒకే దగ్గర గడపటం, ఒకరిగురించి మరొకరు పట్టించుకోవటం, యోగక్షేమాలు తెలుసుకునే వీలు కలగటం వల్ల ఒక విధంగా నేను సంతోషంగా ఉన్నా.”

– మెలానియా ట్రంప్​, అమెరికా ప్రథమ మహిళ

తనకు కరోనా సోకినప్పటికీ.. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండటం వల్ల తాను అదృష్టవంతురాలినని పేర్కొన్నారు మెలానియా. సహజమైన మార్గంలో మెడిసిన్​ తీసుకోవటం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా ఎంచుకున్నట్లు తన అనుభవాన్ని పంచుకున్నారు. తమ చుట్టూ అద్భుతమైన సంరక్షకులు ఉన్నారని, డాక్టర్​ కాన్లే, ఆయన బృందం విశేష కృషి చేసిందన్నారు. వారికి ఎప్పటికీ కృతజ్ఞులమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This