తెలంగాణలో కొత్తగా 1,811 కరోనా కేసులు.. 9 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 1,811 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,10,346కు చేరింది. వైరస్​తో తాజాగా 9 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,217కు పెరిగింది.

కొవిడ్​ నుంచి కొత్తగా 2,072 మంది బాధితులు కోలుకోగా… ఇప్పటివరకు1,83,025 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,104 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 21,551 మంది బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 291 కరోనా కేసులు నమోదు కాగా..మేడ్చల్ జిల్లాలో 171, రంగారెడ్డి 138, నల్గొండ 108, కరీంనగర్ జిల్లాలో 100  కేసులు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This