ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 3 లక్షల 14 వేల మందికి కరోనా

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా బాధితుల సంఖ్య 3.03 కోట్లు దాటింది. ఇప్పటివరకు మొత్తం 9 లక్షల 50 వేల మందికి పైగా మృతి చెందారు. కరోనా నుంచి 2 కోట్ల 20 లక్షల మంది కోలుకున్నారు.

ప్రపంచ దేశాల్లో ఇదీ పరిస్థితి…
  • అమెరికాలో కొత్తగా 46 వేలకుపైగా కరోనా కేసులు బయటపడ్డాయి. మరో 879 మంది మృతిచెందారు. అగ్రరాజ్యంలో మొత్తం 68 లక్షల 74 వేల మంది కరోనా బాధితులున్నారు. మొత్తం 2.02 లక్షల మందికి పైగా మరణించారు.
  • బ్రెజిల్‌లో మరో 35 వేల మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా 857 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో 5,762 మందికి కొత్తగా కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10.85 లక్షలు దాటింది.
  • పెరులో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 7 లక్షల 50 వేల మంది కరోనా బారినపడ్డారు.
  • మెక్సికోలో 6 లక్షల 80 వేల మందికి కరోనా పాజిటివ్​గా తేలగా… వీరిలో 4.85 లక్షల మంది కోలుకున్నారు. దాదాపు 72 వేల మంది మరణించారు.
  • దక్షిణాఫ్రికాలో 6 లక్షల 55 వేల మందికి కొవిడ్‌ పాజిటివ్​గా తేలింది. దీంతో 15 వేల మందికిపైగా మరణించారు.
  • ‌స్పెయిన్‌లో కొత్తగా 11 వేల 291 కేసులను గుర్తించారు. మరో 162 మంది మరణించారు.
  • మరోవైపు.. ఐరోపాలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది. దీంతో మహమ్మారి రెండో దశ విజృంభణను ఆపేందుకు ఐరోపా దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలని భావిస్తున్నాయి. ఐరోపాలోని దాదాపు సగం దేశాల్లో గత రెండు వారాల్లో కేసులు 10 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.
  • న్యూజిలాండ్​లో తాజాగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. గత ఐదు వారాల్లో కేసు నమోదు కాని రోజు ఇదే కావటం విశేషం. ఆ దేశంలో ఇప్పటివరకు 1800 మంది కరోనా బారిన పడగా .. 25 మంది ప్రాణాలు విడిచారు.
దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు
అమెరికా 68,74,596 2,02,213
భారత్​ 52,14,678 84,370
బ్రెజిల్​ 44,57,443 1,35,031
రష్యా 10,85,281 19,061
పెరు 7,50,098 31,146

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This