దేశంలో ఒక్కరోజే 97,570 కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 97 వేల 570 మందికి వైరస్​ సోకింది. మరో 1201 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 46 లక్షల మార్కు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వరుసగా మూడో రోజు దేశంలో 95 వేలకుపైగా కేసులు బయటపడ్డాయి.

రికవరీలు ఘనం..

కరోనా కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ.. రికవరీలూ అదే స్థాయిలో ఉంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 81 వేల మందికిపైగా కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 77.77కు చేరింది. మరణాల రేటు 1.66 శాతానికి పడిపోయింది.

భారీగా టెస్టుల నిర్వహణ..

సెప్టెంబర్​ 11న 10 లక్షల 91 వేల 215 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది ఐసీఎంఆర్​. మొత్తం టెస్టుల సంఖ్య 5 కోట్ల 51 లక్షల 89 వేల 226కు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This