కరోనా పంజా: 2 కోట్ల 83 లక్షలు దాటిన కేసులు

ప్రపంచదేశాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత్​, అమెరికా, బ్రెజిల్​ దేశాల్లో వైరస్​ ఉగ్రరూపం దాల్చుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ బాధితుల సంఖ్య 2 కోట్ల 83 లక్షల 23 వేలు దాటింది. 9 లక్షల 13 వేల 908 మంది మహమ్మారికి బలయ్యారు. మరోవైపు 2 కోట్ల 3 లక్ష 39 వేల మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

మారణహోమం…

కరోనా కేసుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా 38,811 కేసులు నమోదవగా…1090 మంది మరణించారు.

బ్రెజిల్​…

బ్రెజిల్​లో మహమ్మారి అలుపు లేకుండా దాడి చేస్తూనే ఉంది. కొత్తగా 40 వేల 431 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 922మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు
అమెరికా 65,88,163 1,96,328
బ్రెజిల్​ 42,39,763 1,29,575
రష్యా 10,46,370 18,263
పెరూ 7,10,067 30,344

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This