దేశంలో ఒక్కరోజే 75 వేల కేసులు-1133 మరణాలు

భారత్​లో ఒక్కరోజే 75 వేల 809 కరోనా కేసులు బయటపడ్డాయి. మరో 1133 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో మొత్తం కేసుల సంఖ్య 42 లక్షల 80 వేల 423కి చేరింది. ఇప్పటివరకు 72 వేల 775 మంది కొవిడ్​కు బలయ్యారు.

రికవరీ రేటు 77.65కు చేరింది. మరణాల రేటు 1.7 శాతానికి తగ్గింది.

5 కోట్లు దాటిన టెస్టులు..

కరోనా కట్టడిలో భాగంగా టెస్టులను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా సోమవారం 10 లక్షల 98 వేల 621 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. మొత్తం టెస్టుల సంఖ్య 5 కోట్ల 6 లక్షల 50 వేలు దాటింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This