రక్షణ శాఖ కార్యదర్శికి కరోనా పాజిటివ్!

రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్​ కరోనా బారిన పడ్డట్లు అధికారులు తెలిపారు. అజయ్​ కుమార్​కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలినట్లు స్పష్టం చేశారు. అయితే.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనను హోం క్వారంటైన్​లో ఉంచినట్లు వెల్లడించారు.

కార్యాలయం అప్రమత్తం

అజయ్​ కుమార్​కు కరోనా పాజిటివ్​గా తేలడం వల్ల రక్షణ శాఖ కార్యాలయం అప్రమత్తమైంది. విస్తృతంగా కాంటాక్ట్ ట్రేసింగ్​ను నిర్వహించినట్లు తెలిపింది. సౌత్​ బ్లాక్​లోని రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దాదాపు 35 మంది అధికారులను హోం క్వారంటైన్​కు తరలించింది. ముందు జాగ్రత్తగా రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ కార్యాలయానికి వెళ్లలేదని అధికారులు తెలిపారు.

అయితే అజయ్ కుమార్ ఆరోగ్యంపై రక్షణ శాఖ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This