కరోనా మహమ్మారిపై నేడు పార్లమెంటరీ ప్యానల్​ భేటీ

దేశంలో కరోనా మహమ్మారి రాకెట్​ వేగంతో దూసుకెళుతోంది. అన్​లాక్​ 4 లో భాగంగా మరిన్నిపౌర సేవలకు అనుమతులు ఇచ్చిన క్రమంలో వైరస్​ ఉద్ధృతి మరితం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజా ఆరోగ్యంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం సోమవారం భేటీ కానుంది.

ముసాయిదా 121, 122 ఏటీఆర్(చర్యలు తీసుకున్న నివేదిక)​లను పరిగణనలోకి తీసుకోవటం, కొవిడ్​-19 వ్యాప్తి, దాని సంబంధిత సమస్యలు, కట్టడి ప్రణాళిక​పై అభిప్రాయాలు తీసుకోవటం ప్రధాన అజెండాగా ఈ సమావేశం సాగనుందని తెలుస్తోంది.

ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 90,632 కేసులు నమోదయ్యాయి. 1,065 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత కరోనా కేసుల సంఖ్య బ్రెజిల్​ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరువైంది. మొత్తం 4,113,811 కేసులు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This