దేశంలో 29 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భారత్​లో తాజాగా 68,898 మంది కరోనా బారినపడగా.. మరో 983 మంది మృతి చెందారు. మొత్తం కేసులు 29 లక్షలు దాటాయి.

రికవరీ రేటు 74 శాతం దాటింది. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 21 లక్షల 58 వేల 946 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.89 శాతానికి పడిపోయింది.

దేశంలో ఆగస్టు 7న 20 లక్షల మార్కు దాటగా.. మరో 2 వారాల్లో 9 లక్షల కేసులు నమోదవటం గమనార్హం.

మళ్లీ 8 లక్షల టెస్టులు..

ఐసీఎంఆర్​ గణాంకాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 34 లక్షల 67 వేల 237 నమూనాలను పరీక్షించారు. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 8 లక్షల 5 వేల 985 టెస్టులు చేశారు.

  • యాక్టివ్​ కేసులు: 6,920,28
  • కోలుకున్నవారు:21,589,47
  • మొత్తం మృతులు:54849
  • మొత్తం కేసులు:29,05,824

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This