దేశంలో ఒక్కరోజే 64,531 కేసులు.. 1,092 మరణాలు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. తాజాగా 64,531 మంది వైరస్​ బారిన పడ్డారు. 1,092 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27 లక్షల 67 వేలను అధిగమించింది.

భారత్​లో కొవిడ్​ నిర్ధరణ పరీక్షలను విస్తృతం చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 8 లక్షల నమూనాలను టెస్ట్​ చేశారు. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 3 కోట్ల 17 లక్షలకు చేరింది.

కరోనా రోగుల రికవరీ రేటు మెరుగుపడుతోంది. ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా కోలుకున్నారు. మరణాల రేటులో కూడా క్షీణత కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న సమర్థమైన చర్యల వల్లే ఈ మేరకు సాధ్యమైనట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This