టీమ్ఇండియా ఆటగాడు విజయ్ శంకర్ నిశ్చితార్థం

టీమ్​ఇండియా యువ క్రికెటర్​ విజయ్ శంకర్ పెళ్లి శుభవార్త చెప్పేశాడు. గురువారం వైశాలి విశ్వేశ్వరన్​తో ఇతడి నిశ్చితార్థం జరిగింది. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు శంకర్. సహ ఆటగాళ్లతో పాటు నెటిజన్లు ఈ జోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

విజయ్ శంకర్ టీమ్​ఇండియా తరఫున 12 వన్డేలు, 9 టీ20ల ఆడాడు. గతేడాది జరిగిన ప్రపంచకప్​లో చోటు దక్కించుకున్నాడు. కానీ విఫల ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్నాడు.

ప్రస్తుతం శంకర్ ఐపీఎల్​ 13వ సీజన్​ కోసం సిద్ధమవుతున్నాడు. దుబాయి వేదికగా జరగబోతున్న ఈ లీగ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​కు ఆడనున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This