అందం, నటనతో అలరించే ముద్దుగుమ్మ విద్యాబాలన్‌!

హీరోయిన్ ఓరియెంటడ్ సినిమాలు కూడా వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తా‌యని నటి విద్య బాలన్ నిరూపించింది. ‘డర్టీ పిక్చర్‌’ విజయం గాలివా‌టం కాదని ‘కహానీ’, ‘బాంబే టాకీస్‌’, ‘బాబీ జాసూస్‌’, ‘తుమ్హారీ సులు’ చిత్రాలతో మరో‌సారి రుజువు చేసింది. కెరీర్​ తొలినాళ్లలో ఐరన్​లేడీగా ముద్రవేసుకున్న విద్య.. విజయవంతమైన కథానాయికగా ఎలా ఎదిగిందో చూద్దాం. శుక్రవారం ఈమె పుట్టినరోజు సందర్భంగా విద్య గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.

మాధురీ స్ఫూర్తితో…

ముంబయిలోని చెంబూ‌ర్‌లో విద్య బాల్యం గడి‌చింది. సెయింట్‌ ఆంథోనీ గర్ల్స్‌ హై స్కూల్‌లో చదువుకుంది. పద‌హా‌రేళ్ల వయ‌సులో ఏక్తా‌క‌పూర్‌ తీసిన టీవీ షో ‘’హమ్‌ పాంచ్‌’’లో రాధిక పాత్రలో నటించింది. ఆ తర్వాత అను‌రాగ్‌ బసు ఒక టీవీ షో కోసం విద్యా‌బా‌ల‌న్‌ను సంప్రదించారు. ఆ అవ‌కా‌శాన్ని వద్దని సిని‌మా‌లపై దృష్టి ‌పె‌ట్టింది. మాధు‌రీ‌ దీ‌క్షిత్, షబానా ఆజ్మీల నటన అంటే విద్యా‌బా‌ల‌న్‌కు చాలా ఇష్టం. వాళ్ల స్ఫూర్తి‌తోనే తెర‌పైకి అడుగు‌పె‌ట్టింది. సెయింట్‌ జేవి‌యర్‌ కళా‌శా‌లలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ముంబయి విశ్వ‌విద్యాలయం నుంచి సోషి‌యా‌ల‌జీలో పీజీ పట్టా పుచ్చు‌కొంది.

బెంగాలీ చిత్రంతో..

విద్యాబాలన్ తనను తాను తెరపై చూసు‌కొన్న‌దంటే ‘’భలే థేకో’’ అనే బెంగాలీ చిత్రంలోనే. ఆనంది పాత్రలో విద్య నటన విమ‌ర్శకుల మెప్పు పొందింది. ఉత్తమ నటిగా ఆనం‌దలోక్‌ పుర‌స్కా‌రా‌నికి ఎంపి‌కైంది. ఆ తర్వాత ‘’పరి‌ణీత’’ కోసం హిందీ నుంచి పిలు‌పం‌దు‌కొంది. లలితగా విద్యా‌బా‌లన్‌ ఒది‌గి‌పో‌యిన విధానం బాలీవుడ్‌ వర్గా‌లను ఆక‌ట్టు‌కొంది. ఆ మరు‌సటి ఏడాదే ‘’లగే రహో మున్నా‌భాయ్‌’’లో నటించే అవ‌కా‌శాన్ని సొంతం చేసు‌కొంది. ఇందులో విద్య రేడియో జాకీగా నటిం‌చింది. ఈ సినిమా తర్వాత ఆమెకి వెను‌ది‌రిగి చూసుకొనే అవ‌సరం రాలేదు.

విజ‌యాలు.. విమ‌ర్శ‌కుల మెప్పు

చిత్రసీ‌మలో విజ‌యాలు, విమ‌ర్శకుల ప్రశంసలు ఒకే‌సారి దక్కడం అరు‌దుగా జరు‌గు‌తుంటుంది. అయితే విద్యా‌బా‌లన్‌ సిని‌మాలు మాత్రం రెండిం‌టినీ సొంతం చేసు‌కొం‌టున్నాయి. ‘గురు’, ‘సలామ్‌ ఎ ఇష్క్‌’, ‘ఏక‌లవ్య’, ‘హే బేబీ’, ‘భూల్‌ భులయా’, ‘హల్లాబోల్‌’, ‘కిస్మత్‌ కనె‌క్షన్‌’, ‘పా’, ‘ఇష్కియా’, ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’, ‘థ్యాంక్యూ’ తది‌తర చిత్రా‌లన్నీ చక్కటి విజ‌యాలు సొంతం చేసు‌కొ‌న్నాయి. అదే సమ‌యంలో విద్యా‌బా‌లన్‌ పోషిం‌చిన ఆయా పాత్రలు విమ‌ర్శకుల మెప్పు‌పొందాయి. ముఖ్యంగా ‘గురు’, ‘భూల్‌ భులయా’, ‘ఏక‌లవ్య’, ‘పా’, ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’ తది‌తర చిత్రాల్లో విద్య నటన గురించి ప్రత్యే‌కంగా చెప్పు‌కొ‌న్నారు. ఆ తర్వాత వచ్చిన ‘’ది డర్టీ పిక్చర్‌’’, ‘‘కహానీ’’ చిత్రాలు సరి‌కొత్త రికా‌ర్డు‌లను సృష్టిం‌చాయి. సిల్క్‌‌స్మిత జీవితం ఆధా‌రంగా తెర‌కె‌క్కిన ‘’ది డర్టీ ‌పి‌క్చ‌ర్‌’’లో విద్యా‌బా‌లన్‌ చాలా ఘాటుగా కనిపిం‌చింది. పది‌హేను కిలోలు బరువు పెరిగి మరీ అందచందాలతో ఆకట్టుకుంది. ఈ చిత్రంతో ఆమె జాతీయ ఉత్తమ నటి పుర‌స్కా‌రాన్ని సొంతం చేసు‌కొంది. అలాగే ‘కహా‌నీ’‌ తర్వాత చేసిన ‘’బాంబే టాకీస్‌’’, ‘’బాబీ జాసూస్‌’’, ‘’కహానీ 2’’, ‘’తుమ్హారీ సులు’’ వంటి చిత్రాల్లోనూ ఆమె పోషిం‌చిన పాత్రలకు ప్రశం‌సలు దక్కాయి. త్వరలో ఇందిరాగాంధీ జీవితచరిత్ర ఆధారంగా తీయనున్న సినిమాలో నటించబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This