వెంకీ-త్రివిక్రమ్ కాంబోలో సినిమా లేనట్లేనా!

ప్రముఖ కథానాయకుడు వెంకటేశ్‌తో త్రివిక్రమ్ ఓ చిత్రం చేయబోతున్నారని వార్తలొచ్చాయి. గతంలోనే ఈ కాంబినేషన్‌లో సినిమా రావాల్సి ఉండగా అది కార్యరూపం దాల్చలేదు. ఇటీవలే మళ్లీ ఆ అంశం తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం వెంకటేశ్‌ కథానాయకుడిగా 74వ చిత్రం ‘నారప్ప’లో నటిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. తమిళంలో ఘన విజయం అందుకున్న ‘అసురన్‌’కి రీమేక్ ఇది‌.

ఇదిలా ఉండగానే ‘వెంకీ 75’పై రూమర్లు టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తారంటూ ప్రచారం సాగింది. దీనిపై స్పష్టత ఇచ్చారు నిర్మాత నాగవంశీ. “మేము మీ ఆసక్తిని అర్థం చేసుకోగలం. త్రివిక్రమ్‌- వెంకీ కాంబినేషన్‌లో సినిమా అనే వార్తలు అవాస్తం. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ నిర్మించబోయే తదుపరి చిత్రాల సమచారాన్ని మా అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తాం” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This