‘సరిహద్దుల్లో తలెత్తే ఎలాంటి పరిస్థితికైనా వాయుసేన సిద్ధం’

సరిహద్దుల్లో ఇటీవల కాలంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు వాయుసేన చీఫ్ ఆర్​కేఎస్ భదౌరియా. సరిహద్దులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయుసేన సిద్ధమని ఉద్ఘాటించారు. చైనా బలగాల అనూహ్య దాడిలో మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారని చెప్పిన భదౌరియా.. జవాన్ల త్యాగాల్ని వృథాగా పోనివ్వమని వెల్లడించారు. హైదరాబాద్​ వేదికగా వాయుసేన పాసింగ్ ఔట్ పరేడ్​కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

“ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో మన బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. లద్దాఖ్​​లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు స్వల్పవ్యవధిలోనే ఎంత సంసిద్ధంగా ఉండాలో నొక్కి చెబుతున్నాయి. సైన్యాధికారుల స్థాయిలో చర్చలు.. ఏకాభిప్రాయం అనంతరం చైనా దాడి అనూహ్యమైంది. వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న ఉద్రిక్తతలను శాంతియుతంగానే ఎదుర్కోవాలి.”

-ఆర్​కెఎస్ భదౌరియా, వాయుసేన చీఫ్

గల్వాన్​లోయలో ప్రాణాలకు తెగించి సైనికులు పోరాడటం.. భారత సార్వభౌమాధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో రక్షిస్తామన్న వారి అంకితభావానికి నిదర్శనమని ఉద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This