ముగ్గురు హీరోల చేతుల మీదుగా ‘వసంత కోకిల’ ఫస్ట్​ లుక్​

‘డిస్కో రాజా’ సినిమాతో ప్రతినాయకుడి పాత్రలో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమిళ నటుడు బాబీ సింహా హీరోగా కొత్త సినిమా రాబోతుంది. నవంబరు 6న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓరోజు ముందే సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను గురువారం విడుదల చేసింది చిత్రబృందం. తెలుగులో రానా , తమిళంలో ధనుష్​, కన్నడలో రక్షిత్​ దీనిని రిలీజ్​ చేశారు. వసంత కోకిలగా టైటిల్​ ఖరారు చేశారు. ఇందులో బాబీ.. బలమైన ఆయుధాన్ని చేతిలో పట్టుకుని సీరియస్​ లుక్​లో ఎవరితోనో తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించారు. ఈ పోస్టర్​ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రాన్ని దర్శకుడు రమణన్​ పురుషోత్తమ తెరకెక్కించనున్నారు. రాజేశ్​ మురుగేశన్​ స్వరాలు సమకూర్చనున్నారు. రామ్​ తల్లూరి సమర్పణలో ఎస్.ఆర్.టి. ఎంటర్​టైన్​మెంట్స్​, ముద్రాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This