వరద పోటు.. భద్రాద్రిలో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక

వరద పోటు.. భద్రాద్రిలో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక

గోదావరికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద 19 అడుగుల మేర తగ్గి ప్రవహిస్తోంది. ఉదయం 10 గంటలకు 44.8 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈరోజు రాత్రి 9 గంటలకు నీటిమట్టం 48 అడుగులు దాటే అవకాశముందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.

వరుసగా కురుస్తోన్న వర్షాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం క్రమంగా వస్తోంది. మొదటి ప్రమాదం హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలపై దృష్టిపెట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This