అన్ని ప్రాంతాలకు కొవిషీల్డ్​ టీకా రవాణా షురూ !

జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్​ ప్రక్రియ మొదలుపెట్టనున్న నేపథ్యంలో కొవిషీల్డ్ టీకా పంపిణీ ప్రారంభం కానున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నెల 11, 12 తేదీల్లో మహారాష్ట్ర పూణెలోని సీరం ఇన్​స్టిట్యూట్​ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు టీకా రవాణా అవుతుందని వెల్లడించారు.

సీరం సంస్థ ఉన్న మంజారి ప్రాంతం నుంచి కట్టుదిట్టమైన పోలీసు భద్రతతో వ్యాక్సిన్​తో నిండిన ట్రక్కులు బయలుదేరుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయడానికి మహా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మొదటి దశలో 48 ప్రాథమిక ప్రభుత్వ స్థానాలకు(డిపోలు) టీకా తరలిస్తున్నట్లు కోల్డ్ చైన్ లాజిస్టిక్స్​ సర్వీస్​ ప్రొవైడర్​ సంస్థ కూల్​-ఎక్స్ కోల్డ్ చైన్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు రాహుల్​ అగర్వాల్​ చెప్పారు. దాదాపు 300 జీపీఎస్​లు అమర్చిన ట్రక్కులను ఉపయోగిస్తామన్న ఆయన.. అవసరమైతే ఆ సంఖ్యను 500కు పెంచుతామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This