మరోసారి స్పీకర్​గా పెలోసీ- బైడెన్​ అభినందనలు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​.. పాలనాయంత్రాంగంపై దృష్టిపెట్టారు. తన మంత్రివర్గ కూర్పుపై కసరత్తులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్పీకర్​గా ఉన్న పెలోసీ.. మరోసారి ఆ పదవికి నామినేట్​ అయ్యారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు జో బైడెన్.​

“దేశంలో కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే అజెండాతో డెమొక్రటిక్​ నాయకత్వంలో ఆమెతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను”

– జో బైడెన్​, కాబోయే అమెరికా అధ్యక్షుడు

తమ నాయకులను ఎన్నుకోవటానికి డెమొక్రటిక్​ పార్టీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఎక్కువమంది పెలోసీని బలపరిచారు. దీంతో ఆమె వచ్చే రెండేళ్లలో స్పీకరు బాధ్యతను నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This