‘కొవిడ్​-19 వ్యాక్సిన్​ అభివృద్ధికి భారీ బడ్జెట్ అవసరం’​

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారిని నివారించేందుకు వాక్సిన్​ పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్​-19 వ్యాక్సిన్, ఇతర చికిత్స విధానాల​ అభివృద్ధి కోసం భారీగా నిధులు అవసరమని అంతర్జాతీయ వ్యాక్సిన్​ పరిశోధన నిపుణులు పేర్కొన్నారు. నిధుల సమీకరణకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు.

కరోనా వ్యాక్సిన్​ తయారీ, నిధుల సమీకరణకు మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతోనే.. ఐరోపా సమాఖ్య సదస్సుకు ఒక్క రోజు ముందు ఈ మేరకు వెల్లడించారు పరిశోధకులు. చొరవ చూపటంలో అమెరికా సైతం దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా చికిత్స సాధనాలు, వ్యాక్సిన్​ అవసరమైన ప్రజలకు ఖర్చుతో నిమిత్తం లేకుండా అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, దాని మిత్ర దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే.. వ్యాక్సిన్​, చికిత్స విధానాలు, ఔషధాల కోసం 2021 చివరి నాటికి సుమారు 31 బిలియన్​ డాలర్లకుపైగా అసరమని అంచనా వేశాయి.

” కొవిడ్​-19 వ్యాక్సిన్​ కోసం తొందరపడకపోతే.. మానవ వనరులు, ఆర్థిక నష్టం మరింత ఎక్కవ అవుతుంది. ఆ సంఖ్య ఊహించుకోవడానికి ఎక్కువగా ఉన్నా.. ఎప్పుడైతే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించిస్తామో ఆ నష్టం అంతగా అనిపించదు. భవిష్యత్​లో ఆర్థిక వ్యవస్థలను పునరుత్తేజనం చేసేందుకు ట్రిలియన్​ డాలర్లు ఖర్చు చేయడంపై ఆలోచించండి. ఇప్పుడు బిలియన్స్​ ఖర్చు చేసినట్లయితే.. ఆ తర్వాత ట్రిలియన్స్​ ఖర్చు చేయాల్సిన అవసరం రాదు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This