ట్రంప్‌పై విష ప్రయోగానికి కుట్ర పన్నిన మహిళ అరెస్ట్‌!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై విష ప్రయోగం జరిపేందుకు కుట్రపన్నినట్లు అనుమానిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. న్యూయార్క్‌-కెనడా సరిహద్దుల్లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ట్రంప్‌నకు చేరేలా శ్వేతసౌధం చిరునామాతో వచ్చిన పార్శిల్‌ కెనడా నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా జరిపిన విచారణలో ఓ మహిళే నిందితురాలని తేలినట్లు తెలుస్తోంది. ఆమె వివరాలు మాత్రం బయటకు వెల్లడించలేదు.

‘రైసిన్‌’ అనే విషం ఉన్న ఓ పార్శిల్‌ను అధ్యక్ష భవనానికి చేరకముందే పోలీసులు పరీక్షించి అడ్డుకున్నారు. ఆ పార్శిల్‌ను ఎవరు పంపించారో గుర్తించేందుకుగానూ ఎఫ్‌బీఐ, సీక్రెట్‌ సర్వీస్‌, అమెరికా పోస్టల్‌ తనిఖీ సేవల విభాగం దర్యాప్తు చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This